Header Banner

ఘటన స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి! 8 కి చేరిన మృతుల సంఖ్య.. ఒక్కొక్కరికి.!

  Sun Apr 13, 2025 19:15        Politics

బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను... కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)... భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. కాగా, హోం మంత్రి అనిత కైలాసపట్నం చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు.

 

ఇది కూడా చదవండి: భూమన హిందువు కాదు.. టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దు! బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!

 

ప్రమాద ఘటనపై స్థానికులు, అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి అనిత రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని, ఏడుగురికి గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని అనిత చెప్పారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేవ్ ఆరా తీశారని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations